8వరౌండ్‌లో హర్ష విజయం


Thu,October 11, 2018 12:59 AM

praveen
అహ్మదాబాద్: హైదరాబాద్ చెస్ సంచలనం హర్ష భరత్‌కోటి ఎనిమిదో రౌండ్‌లో ఘన విజయం సాధించాడు. ఏడో రౌండ్‌లో ఓడినా .. వెంటనే భారత్‌కే చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ రాహుల్ శ్రీవాస్తవపై విజయంతో మళ్లీ కోలుకున్నాడు. దీంతో అహ్మదాబాద్‌లో జరుగుతున్న తొలి గుజరాత్ అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ చెస్‌టోర్నీలో 6.6 పాయింట్లతో టైటిల్ రేసులో కొనసాగుతున్నాడు. ఇప్పటికే మూడు గ్రాండ్‌స్లామ్ నార్మ్‌లు దక్కించుకుని ఈ టోర్నీలో ఆరు విజయాలతో 2400 ఎలో రేటింగ్ పాయింట్లకు చేరడం ద్వారా గ్రాండ్‌మాస్టర్ హోదాను అధికారికంగా అందుకునేందుకు మరింత దగ్గరయ్యాడు.

226

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles