ఆసక్తికరంగా ఎక్స్1 రేసింగ్ లీగ్


Wed,December 4, 2019 02:00 AM

racing
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: దేశంలో లీగ్ పరంపర కొనసాగుతున్నది. ఇప్పటికే క్రికెట్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ అభిమానులను అలరిస్తుంటే ఈ జాబితాలో తాజాగా రేసింగ్ చేరింది. రేసింగ్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఆరు ఫ్రాంచైజీల సమహారంతో ఎక్స్1 రేసింగ్ లీగ్‌ను దేశంలో కొత్తగా తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఎక్స్1 రేసింగ్ లీగ్‌లో అఖిల్ రెడ్డికి చెందిన హైదరాబాద్ బ్లాక్ బర్డ్ ప్రత్యర్థి జట్లకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగుతున్నది. ఢిల్లీ సర్యూట్‌లో ఆకట్టుకున్న హైదరాబాద్..చ్నై వేదికగా ఈనెల 7, 8 తేదీల్లో జరిగే రేసుకు సిద్ధమైంది. మంగళవారం మీడియా సమావేశంలో రేసర్లు వింటానియో లుజీ, ఆనందిత్ రెడ్డి, అఖిల్ రవింద్ర, గోసియా డెస్ట్, అర్జున్ నరేంవూదన్ అలరించారు.

150

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles