సాట్స్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు సన్మానం


Tue,February 13, 2018 02:15 AM

venkateswara-reddy
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రం నుంచి జాతీయ చాంపియన్‌షిప్‌లలో పాల్గొని పతకాలను సాధించిన 350 మంది క్రీడకారులను సన్మానించనున్నట్లు సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 17వ తేదీ సాయంత్రం నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సోమవారం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలోని క్రీడాకారులు రాణించడానికి కావలసిన సహాయంతోపాటు ప్రోత్సహించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

సీఎం చంద్రశేఖరావు ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని క్రీడాకారులు రాష్ర్టానికి పతకాలను తీసుకురావాలని కోరారు. రెజ్లింగ్‌లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు ఉపయోగించే విధంగా 10 అకాడమీలకు కుస్తీ కిట్లను అందజేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఆర్ ప్రేమ్‌రాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని క్రీడా సంఘాలను సమన్వయం చేస్తూ క్రీడల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో ఉస్మానియా యూనివర్సిటీ ఐయుటీ కార్యదర్శి ప్రొఫెసర్ రాజేశ్‌కుమార్, తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫేడరేషన్ కార్యదర్శి కే రాంరెడ్డి, క్రీడా సంఘాల ప్రతినిధులు ముటా శ్రీనివాస్, పీ సంతోష్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.

198

More News

VIRAL NEWS

Featured Articles