హాకీలో పాక్‌ను ఆడుకున్నారు


Mon,June 19, 2017 02:11 AM

వరల్డ్ హాకీ లీగ్‌లో 7-1తో దాయాది జట్టుపై భారత్ విజయం

లండన్‌లో ఓవైపు మన క్రికెట్ జట్టు నిరాశపరిస్తే.. హాకీ వీరులు మాత్రం మురిపించారు. శతకోటి భారతావని ఆశలను మోస్తూ వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను భారత్ భరతం పట్టింది. జాతీయ క్రీడ హాకీలో మన ప్రభ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూ జయభేరి మోగించింది. వార్‌వన్‌సైడ్ అన్న తరహాలో పాక్‌ను ఉతికిఆరేసింది. ఆదివారం పూర్తి ఏకపక్షంగా సాగిన చ్‌లోపాక్‌పై భారీ విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. హాకీ చరిత్రలో దాయాదిపై టీమ్‌ఇండియాకు ఇదే పెద్ద రికార్డు కావడం విశేషం.
hockey
లండన్: వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్‌లో భారత్ అదరగొట్టింది. భారత్ 7-1 గోల్స్ తేడాతో దాయాది జట్టు పాకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. గతం(2003)లో చాంపియన్స్ ట్రోఫీ, కామన్వెల్త్ గేమ్స్‌లో 7-4 తేడాతో గెలువడమే ఇప్పటివరకు అత్యుత్తమం. ఈ విజయంతో భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే క్వార్టర్ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. మంగళవారం ఆఖరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో మన్‌ప్రీత్‌సేన తలపడుతుంది. మ్యాచ్ తొలి క్వార్టర్ పదినిమిషాలు మినహా మొత్తం భారత్‌దే సంపూర్ణ ఆధిపత్యం. హర్మన్‌ప్రీత్‌సింగ్(13ని, 33ని), తల్విందర్‌సింగ్(21ని, 24ని), ఆకాశ్‌దీప్‌సింగ్(47ని, 59ని), ప్రదీప్‌మోర్(49ని) గోల్స్ చేశారు. మరోవైపు ప్రత్యర్థి పాక్ తరఫున ముహమ్మద్ ఉమర్(57ని) ఏకైక గోల్ చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే తొలుత పాక్‌కు గోల్ చేసే అవకాశమచ్చినా జారవిడుచుకుంది. అయితే 13వ నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్‌సింగ్ గోల్‌గా మలిచాడు.

1-0 ఆధిక్యంతో రెండో క్వార్టర్‌లోకి ప్రవేశించిన భారత్‌కు 21వ నిమిషంలో తల్వీందర్‌సింగ్ కొట్టిన ఫీల్డ్‌గోల్‌తో ఆధిక్యం రెట్టింపు అయ్యింది. మరో మూడు నిమిషాల వ్యవధిలో తల్వీందర్ మరో ఫీల్డ్‌గోల్ నమోదు చేశాడు. ఇలా తమ ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంటూ పోయిన టీమ్‌ఇండియా అదే జోరు కొనసాగించింది. ఈ క్రమంలో పాక్ డిఫెన్స్ లోపాలను అనుకూలంగా మలుచుకుంటూ వరుస దాడులతో విరుచుకుపడింది. దీనికి దాయాది నుంచి సరైన సమాధానం లేకపోయింది. ఇటీవల ఉగ్రదాడిలో చనిపోయిన జవాన్లకు సంఘీభావంగా భారత ఆటగాళ్లు నల్లరిబ్లన్లు ధరించి బరిలోకి దిగారు.

281

More News

VIRAL NEWS