సుల్తాన్ జొహర్ కప్‌లో భారత్


Thu,September 20, 2018 12:45 AM

hockeyindia
న్యూఢిల్లీ: మలేషియా వేదికగా వచ్చే నెల 6వ తేదిన మొదలయ్యే ప్రతిష్ఠాత్మక సుల్తాన్ జొహర్ కప్ జూనియర్ హాకీ టోర్నీకి భారత జట్టును ఎంపిక చేశారు. బుధవారం హాకీ ఇండియా(హెచ్‌ఐ) 18 మందితో కూడిన జట్టు సభ్యులను ప్రకటించింది. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగనున్న ఈ టోర్నీలో యువ భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య మలేషియాతో తలపడుతుంది. న్యూజిలాండ్, జపాన్, ఆస్ట్రేలియా, గ్రేట్ బ్రిటన్‌తో ఆ తర్వాతి మ్యాచ్‌లు ఆడుతుంది. టాప్-2లో నిలిచిన జట్లు అక్టోబర్ 13న జరిగే ఫైనల్లో ఢీకొంటాయి. మిగిలిన నాలుగు జట్లు వర్గీకరణ మ్యాచ్‌ల్లో ఆడుతాయి. మణ్‌దీప్ మోర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, శీలానంద్ లక్రా వైస్‌కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తాడు. కమల్‌బీర్‌సింగ్, పంకజ్‌కుమార్ రజాక్ గోల్‌కీపర్లుగా కొనసాగుతారు. సుమన్ బెక్, మహ్మద్ ఫరాజ్, సోమ్‌జీత్, మణ్‌దీప్, ప్రిన్స్, విరేందర్‌సింగ్‌తో డిఫెన్స్ విభాగం పటిష్ఠంగా కనిపిస్తున్నది. గుర్షబిజీత్‌సింగ్, అభిషేక్, ప్రభ్‌జ్యోత్‌సింగ్, శీలానంద్ లక్రా ఫార్వర్డ దళాన్ని నడిపించనున్నారు. ఇటీవలి బెంగళూరు జాతీయ క్యాంప్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను ఎంపిక చేసినట్లు చీఫ్ కోచ్ జ్యూడ్ ఫెలిక్స్ తెలిపాడు.

237

More News

VIRAL NEWS