వరల్డ్ చాంపియన్‌షిప్‌లో హిమకు చోటు


Tue,September 10, 2019 02:21 AM

Hima-Das
న్యూఢిల్లీ : ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే 25మంది సభ్యుల భారత జట్టులో యువ స్ప్రింటర్, ఇటీవల పసిడి పతకాలతో మెరుస్తున్న హిమా దాస్ చోటు సంపాదించింది. ఈ నెల 27 నుంచి దోహా వేదికగా ప్రారంభం కానున్న ఈ టోర్నీ కోసం అథ్లెట్లను భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) సోమవారం నిర్వహించిన సమావేశం అనంతరం ఎంపిక చేసింది. 400మీటర్ల క్వాలిఫయింగ్ పోటీలో హిమా దాస్ అర్హత సాధించకున్నా... మహిళల 4x400, మిక్స్‌డ్ 4x400 మీటర్ల రిలే పోటీల్లో పాల్గొనేందుకు చోటు కల్పించింది. ఇదే విభాగాల్లో ఎంఆర్ పూవమ్మ బరిలోకి దిగనుంది. మిక్స్‌డ్ 4x400 రిలే పోటీలో అథ్లెట్లు తప్పక పతకం సాధిస్తారని ఏఎఫ్‌ఐ అంచనా వేస్తున్నది. మోచేయి శస్త్రచికిత్స చేయించుకొని కోలుకుంటున్న జావెలిన్‌త్రో యర్ నీరజ్ చోప్రా ఎంపికపై త్వరలో సెలెక్టర్లు చర్చించనున్నారని ఏఎఫ్‌ఐ ప్రకటించింది. అలాగే 100మీటర్ల వ్యక్తిగత విభాగం కోసం ఈ నెల 21న అంజలీ దేవికి అర్హత పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపింది.

191

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles