గ్రామీణ క్రికెటర్లకు ప్రోత్సాహం: వివేక్


Sat,January 13, 2018 02:56 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: గ్రామీణ క్రికెటర్లకు మేలు జరిగేలా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో జీ వెంకటస్వామి స్మారక తెలంగాణ టీ20 లీగ్ తొలి దశ విజయవంతంగా ముగిసిందని హెచ్‌సీఏ అధ్యక్షుడు జీ వివేకానంద తెలిపారు. ఈ లీగ్ దశ-2లో తెలంగాణ రాష్ట్రంలోని పాత పది జిల్లాల పేరుతో పదిజట్లకు బిడ్డింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం జింఖానా మైదానంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయా జట్లను దక్కించుకున్న యజమానులను వివేకానంద పరిచయం చేశారు. రూ.12లక్షల చొప్పున ఒక్కో జట్టును ఆయా యజమానులు దక్కించుకున్నట్లు వివరించారు. ఈ టోర్నీకి హెచ్‌సీఏ నుంచి ఎలాంటి కేటాయింపులు లేవన్నారు. స్పాన్సర్ల సాయంతోనూ జట్ల అమ్మకంతో ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేసారు. ఈ టోర్నీ వచ్చేనెల 3 న ప్రారంభం కానుండగా ఫైనల్ వచ్చేనెల 22న ఉప్పల్ స్టేడియంలో ముగుస్తుందన్నారు. టోర్నీ విజేతకు రూ.15, రన్నరప్‌జట్టుకు రూ.7.5లక్షలు బహుమతిగా అందిస్తామన్నారు. ఈ టోర్నీలో రాణించిన క్రికెటర్లకు రంజీ ఇతర జట్ల ఎంపికలో ప్రాధాన్యం ఇస్తామన్నారు.

191

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles