హర్షల్ పటేల్ ఔట్


Fri,April 12, 2019 02:12 AM

harshal-patel
కోల్‌కతా: ఇప్పుడిప్పుడే విజయాల గాడిలో పడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కుడి చేతి గాయంతో సీమర్ హర్షల్ పటేల్ ఐపీఎల్ మొత్తానికే దూరమయ్యాడు. ఈనెల 1న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో పటేల్ గాయపడ్డాడు. అతని కుడి చేతి ఎముక విరిగినట్లు ఎక్స్‌రేలో తేలింది. నాలుగు వారాల పాటు విశ్రాంతి కావాలని డాక్టర్లు సూచించారు. దీంతో అప్పటికి టోర్నీ కూడా చివరి దశకు చేరుకుంటుంది. కాబట్టి ఈ సీజన్‌కు పటేల్ అందుబాటులో ఉండటం లేదు. అతని స్థానంలో ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాలి అని కోచ్ రికీ పాంటింగ్ వెల్లడించాడు. ఇప్పటివరకు ఢిల్లీ ఆరు మ్యాచ్‌లు ఆడితే అందులో రెండింటిలో హర్షల్ బరిలోకి దిగాడు. లెఫ్ట్యాండర్ మన్‌జ్యోత్ కల్రా కూడా కుడి చేతి గాయంతో ఇబ్బందిపడుతున్నాడని పాంటింగ్ తెలిపాడు. అతను ఫిట్‌నెస్ పరీక్ష పాస్‌కావాల్సి ఉందన్నాడు. శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్ వరకు అతను కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

కెల్లీతో కేకేఆర్ ఒప్పందం

మరోవైపు ఆస్ట్రేలియాకు చెందిన అన్‌క్యాప్‌డ్ పేస్ మ్యాట్ కెల్లీతో కోల్‌కతా ఒప్పందం చేసుకుంది. భుజం గాయంతో ఇబ్బందిపడుతున్న దక్షిణాఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్ట్‌జీ స్థానంలో అతన్ని తీసుకుంది. 24 ఏండ్ల పేస్ బౌలర్ కెల్లీ 16 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో 20 టీ20 మ్యాచ్‌ల్లో బరిలోకి దిగాడు.

1318

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles