హార్దిక్ ప్రతిభతో ఎవరూ సరితూగలేరు


Thu,May 16, 2019 04:00 AM

sehwag
న్యూఢిల్లీ: ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రతిభతో ప్రస్తుత జట్టులో ఎవరూ సరితూగలేరని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఇటీవలి కాలంలో హార్దిక్ లాంటి నిఖార్సైన ఆల్‌రౌండర్‌ను తాను చూడలేదని సెహ్వాగ్ అన్నాడు. ముంబై ఇండియన్స్‌కు రికార్డు స్థాయిలో నాలుగో టైటిల్‌ను అందించడంలో హార్దిక్ కీలకంగా వ్యవహరించాడు. మొత్తం 16 మ్యాచ్‌ల్లో 191.42 ైస్ట్రెక్‌రేట్‌తో 402 పరుగులు చేసిన హార్దిక్ 14 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెహ్వాగ్ స్పందిస్తూ బ్యాటుతో, బంతితో రాణించగల సత్తా ఉన్న హార్దిక్ ప్రతిభకు జట్టులో ఎవరూ దరిదాపుల్లో కూడా లేరు. బీసీసీఐ ఎంపిక చేసిన త్రీ డైమెన్షన్ ప్లేయర్లు కొంతలో కొంత పాండ్యాకు దగ్గర్లో ఉన్నారు. అంతకుమించి అతన్ని అందుకునే వారు లేరు అని సెహ్వాగ్ అన్నాడు. ఓ ప్రైవేట్ టెలివిజన్ కార్యక్రమంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యల చేసిన కారణంగా హార్దిక్, రాహుల్‌పై బీసీసీఐ తాత్కాలిక సస్పెన్షన్‌తో పాటు జరిమానా విధించిన సంగతి విదితమే.

528

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles