హామిల్టన్ @ 1000 చైనీస్ గ్రాండ్‌ప్రి కైవసం


Mon,April 15, 2019 02:09 AM

షాంఘై: బ్రిటన్ ఫార్ములావన్ స్టార్ లూయిస్ హామిల్టన్ తన కెరీర్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. చైనా గ్రాండ్‌ప్రి టైటిల్ గెలువడం ద్వారా 1000వ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన రేసులో హామిల్టన్(మెర్సిడెస్), వాల్‌టెరీ బొటాస్(మెర్సిడెస్), సెబాస్టియన్ వెటెల్(ఫెరారీ) పోడియం ఫినిష్ చేశారు. రేసును రెండో స్థానం నుంచి మొదలుపెట్టిన హామిల్టన్..సహచర మెర్సిడెస్ డ్రైవర్ బొటాస్‌కు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగాడు. ఆదిలో కొంత తడబడ్డా ఆ తర్వాత తేరుకుని రేసును దిగ్విజయంగా ముగించాడు. తన కెరీర్‌లో ఆరోసారి చైనీస్ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను దక్కించుకున్న హామిల్టన్‌కు ఈ సీజన్‌లో ఇది వరుసగా రెండో విజయం.

163

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles