అథ్లెట్ల సమరానికి తెర


Mon,October 7, 2019 03:36 AM

దోహా: పది రోజుల పాటు పతకాల కోసం ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన అథ్లెట్లు పోటీ పడిన అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ ఆదివారంతో ముగిసింది. ఈసారి కూడా భారత అథ్లెట్లు పతకం లేకుండా రిక్తహస్తాలతోనే వెనుదిరిగారు. అయితే, 4x400 మిక్స్‌డ్‌ రిలే జట్టు, 3000 మీటర్ల స్టిపుల్‌చేజ్‌లో అవినాశ్‌ సేబల్‌ టోక్యో ఒలింపిక్స్‌ (2020) బెర్తులు సాధించడం కాస్త సంతృప్తికర అంశం. ఆదివారం జరిగిన పురుషుల మారథాన్‌లో భారత అథ్లెట్‌ గోపీ తొనకల్‌ 21వ స్థానంలో నిలిచాడు. లక్ష్యం చేరేందుకు 2గంటల 15నిమిషాల 57 సెకన్లు తీసుకున్నాడు. కాగా మెగాటోర్నీ పతకాల పట్టికలో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. చాంపియన్‌షిప్‌ చరిత్రలో భారత్‌ ఇప్పటి వరకు ఒకే ఒక కాంస్యం సాధించగలిగింది. 2003 పోటీల్లో మహిళా అథ్లెట్‌ అంజు బాబి జార్జ్‌ లాంగ్‌జంప్‌లో ఆ పతకం దక్కించుకుంది.

514

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles