డోప్ టెస్టులో గోమతి విఫలం


Wed,May 22, 2019 02:47 AM

gomathi
న్యూఢిల్లీ: భారత అథ్లెట్ గోమతి మరిముత్తు డోప్ టెస్టులో విఫలమైంది. ఇటీవల జరిగిన ఆసియా చాంపియన్‌షిప్ 800 మీటర్ల పరుగులో స్వర్ణ పతకం సాధించిన గోమతి నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలడంతో ఆమెపై సస్పెన్షన్ పడింది. తమిళనాడుకు చెందిన 30 ఏండ్ల గోమతి.. గత నెలలో దోహా వేదికగా జరిగిన పోటీల్లో 2 నిమిషాల 2.70 సెకండ్లలో గమ్యాన్ని చేరి పసిడి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఎశాంపిల్‌లో దోషి గా తేలిన గోమతి.. బిశాంపిల్‌లో కూడా డోపీగా రుజువైతే ఆమెపై నాలుగేండ్ల బ్యాన్ పడే అవకాశం ఉంది.

162

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles