గౌరవ్‌కు ప్రపంచ బెర్త్

Tue,July 18, 2017 12:28 AM

న్యూఢిల్లీ: బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో బెర్త్ ఖాయమైంది. జర్మనీలోని హాంబర్గ్ నగరంలో ఈ ఏడాది ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 2 వరకు జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు భారత బాక్సర్ గౌరవ్ బిధూరీకి అవకాశం దక్కినట్లు ఆసియా బాక్సింగ్ సంఘం (ఏఎస్‌బీసీ) సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. గౌరవ్ అర్హత సాధించిన విషయాన్ని అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్‌కు తెలిపినట్లు వివరించింది.తాష్కెంట్‌లో జరిగిన ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో అర్హత సాధించడంలో విఫలమైనా గౌరవ్‌కు అనుకోని అదృష్టం తలుపు తట్టింది. 56 కేజీల విభాగంలో అవకాశం దక్కించుకున్న భూటాన్ దేశం వారి కోటాను నిరాకరించిందని.. ఆ తర్వాత స్థానంలో కొనసాగుతున్న గౌరవ్ అర్హత సాధించినట్లు ఏఎస్‌బీసీ తెలిపింది. ఈ మేరకు భారత బాక్సింగ్ సమాఖ్యతోపాటు గౌరవ్‌కు ఈ మెయిల్ చేసి అతని ఎంపికను నిర్ధారించింది.

82

More News