సుప్రియకు రూ. 2 లక్షల ఆర్థిక సహాయం


Sat,January 13, 2018 03:30 AM

padhmarao
మారేడ్‌పల్లి: జాతీయ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో రజతం సాధించిన తెలంగాణ షూటర్ ఏ సుప్రియకు.. రాష్ట్ర క్రీడల మంత్రి టీ పద్మారావు గౌడ్ రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. బోయిన్‌పల్లి ప్రాంతానికి చెందిన సుప్రియ.. గగన్ నారంగ్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నది. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందజేస్తుందని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు. పతకం గెలిచి తెలంగాణకు పేరు తీసుకురావడం ఎంతో సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, నాయకులు రవి, యాదగౌడ్, షకీబ్ తదితరులు పాల్గొన్నారు.

418
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles