రోజర్ నాతో డ్యాన్స్‌కు సిద్ధమా..!


Tue,July 18, 2017 12:42 AM

muguruza
వింబుల్డన్ ముగిసిన అనంతరం చాంపియన్స్ బాల్ ఈవెంట్ పేరుతో విజేతలకు రెడ్‌కార్పెట్‌తో స్వాగతం పలికి గ్రాండ్‌గా పార్టీ ఇవ్వడం టోర్నీ ఆనవాయితీ. అంతేకాదు ఈ పార్టీలో మహిళల సింగిల్స్ విజేతతో పురుషుల సింగిల్స్ విజేత డ్యాన్స్ చేయడం కూడా ఆ సంప్రదాయంలో భాగమే. ఇందులో భాగంగా శనివారం మహిళల సింగిల్స్ ఫైనల్ తర్వాత.. చాంపియన్స్ పార్టీలో మీరు ఎవరితో డ్యాన్స్ చేయాలనుకుంటున్నారు అని విజేత గార్బినె ముగురుజను మీడియా సరదాగా ప్రశ్నించింది. ఇందుకు ముగురుజ ఏమాత్రం తడుముకోకుండా.. నాకు ఫెదరర్‌తో డ్యాన్స్ చేయాలనుంది అని సమాధానమిచ్చింది. తాను కోరుకున్నట్లుగానే పురుషుల సింగిల్స్ ఫైనల్లో సిలిచ్‌ను చిత్తుచేసి ఫెదరర్ విజేతగా నిలువడంతో ముగురుజ.. రోజర్.. నాతో డాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా? అంటూ ట్వీట్ చేసింది. ఇందుకు ఫెదరర్ స్పందిస్తూ.. నేను సిద్ధమే, నన్ను తీసుకెళ్లు అంటూ ఫన్నీగా ట్వీట్ చేశాడు. ఆ తర్వాత పార్టీలో ముగురుజతో కలిసి ఫెదరర్ డ్యాన్స్ చేశాడు.

469

More News

VIRAL NEWS