పుతిన్..గొడుగు మీ ఒక్కరికేనా!


Tue,July 17, 2018 01:06 AM

-ఫిఫా ట్రోఫీ ప్రదానం సమయంలో సరదా సన్నివేశం
-సామాజిక మాధ్యమాల్లో వైరల్..

FIFA
మాస్కో: ఫిపా ప్రపంచకప్ ట్రోఫీ ప్రదానోత్సవం సందర్భంగా ఓ సరదా సన్నివేశం సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా నిలిచింది. ఆదివారం రాత్రి ముగిసిన ఫైనల్లో 4-2 గోల్స్‌తో క్రొయేషియాను ఓడించిన ఫ్రాన్స్‌జట్టు చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. క్రొయేషియా, ఫ్రాన్స్ జట్టు ఫైనల్ చేరడంతో ఆయా దేశాల అధ్యక్షులు ఈ మ్యాచ్‌కు హాజరయ్యారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మక్రాన్, క్రొయేషియా అధ్యక్షురాలు కొలిండా గ్రాబర్‌తో సహా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్‌ఫాన్టినో హాజరయ్యారు. మ్యాచ్ సందర్భంగా ఫ్రాన్స్ గోల్ కొట్టిన ప్రతి సందర్భంలోనూ..ట్రోఫీ నెగ్గిన ఆనందంలో మక్రాన్ నాట్యం చేస్తూ కనిపించగా..ఫైనల్ ముగిసిన అనంతరం ఫ్రాన్స్ ఆటగాళ్లను అభినందిస్తూ.సొంత దేశాల ఆటగాళ్లను ఓదారుస్తూ కొలిండా గ్రాబర్ బిజీగా ఉన్నారు. ట్రోఫీ ప్రదాన సమయంలో పోడియం మీదకు అందరు దేశాధ్యక్షులు చేరుకున్నారు. స్టేడియంలో సంబురాలు..ఫ్రాన్స్ ఆటగాళ్ల కేరింతలు కొనసాగుతుండగా ఈలోపు వర్షం కూడా మొదలైంది. వేదికపై అందరూ ఉండగా పుతిన్ సిబ్బంది ఆయనకు ఒక్కరికే గొడుగుపట్టారు. ఒకవైపు ఫిపా అధ్యక్షుడు సహా వేదికపై మిగిలినవారంతా వర్షంలో తడుస్తూనే ఉండగా సిబ్బంది వారిని ఏమాత్రం పట్టించుకోలేదు. అనంతరం వర్షం ఆగకుండా ఉండడంతో మిగిలినవారికి కూడా సిబ్బంది గొడుగులు తెప్పించారు. మైదానంలోని కెమెరాలు ఈ దృశ్యాన్ని కెమెరాల్లో బంధించడంతో సోషల్ మీడియాలో అందరూ తెగ జోకులు పేలుస్తూ సరదా పడుతున్నారు.

సరదా కామెంట్లు కొన్ని

రష్యాలో కేవలం ఒక్క గొడుగే ఉందా మిస్టర్ పుతిన్ అంటూ కొందరు ప్రశ్నిస్తుండగా..ట్రోఫీ ప్రెజెంటేషన్ కార్యక్రమం కంటే పుతిన్ గొడుగు సన్నివేశమే హైలౌట్ అని కొందరు చలోక్తులు విసరగా.. ఫ్రాన్స్ గెలిచింది మనం ఏం చేద్దాం మిస్టర్ ప్రెసిడెంట్..వారిని వరదల్లో ముంచేద్దాం అంటూ ఎన్ని గొడుగులు తెచ్చుకోవాలి అని అడిగితే ఒక్కటే తీసుకురండి ..వారు రష్యాని ఓడించారు కదా.వాళ్లను వర్షంలో తడవనీ అందరికీ గొడుగులు ఎందుకు ఇవ్వలేదంటే రష్యాను ఓడించారు కదా అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఇతర దేశాధినేతలు వర్షంలో తడుస్తుంటే మీకే గొడుగు పట్టారంటే పవర్ అని అర్థం చేసుకోవాలి అని కొందరు ట్వీటారు.

850

More News

VIRAL NEWS