మహిళలపై రజాక్ వివాదాస్పద వ్యాఖ్యలు


Fri,July 19, 2019 03:12 AM

razak
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ చిక్కుల్లో పడ్డాడు. ప్రపంచకప్ జరుగుతున్న సందర్భంలో మహ్మద్ షమీ మతాన్ని ప్రస్తావిస్తూ ముస్లిం కాబట్టే అద్భుత ప్రదర్శన చేస్తున్నాడన్న రజాక్.. తాజాగా మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కాడు. ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెండ్లయ్యాక తాను ఐదారుగురు అమ్మాయిలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నానని, ఇది తనకు తప్పు అనిపించలేదని నోరు జారాడు. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో దూమారం రేగుతున్నది. గొప్ప ఆటగాడివని ఇన్నాళ్లూ గౌరవముండేదని, ఈ మాటలతో నీవు ఎలాంటి వాడివో తేలిపోయిందంటూ రజాక్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. క్రికెట్ ఆడే రోజుల్లో మంచివ్యక్తిగా పేరు తెచ్చుకున్న రజాక్.. రిటైరయ్యాక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉన్న పరువు తీసుకుంటున్నాడు.

340

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles