హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి పోటీచేస్తా: అజరుద్దీన్


Fri,July 19, 2019 02:58 AM

azzu
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి తాను పోటీచేయబోతున్నట్లు భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ గురువారం ప్రకటించాడు. గతంలో(2017)నూ అధ్యక్ష పదవి కోసం పోటీపడ్డ అజరుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఆరోపణలతో కీలక పదవికి దూరమయ్యాడు. బీసీసీఐ విధించిన నిషేధం ఎత్తివేతకు సంబంధించి సరైన ఆధారాలు కోర్టుకు సమర్పించని కారణంగా అజర్ పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీనికి తోడు ఏ క్రికెట్ క్లబ్ నుంచి తాను పోటీ చేస్తున్నాడన్న దానిపై సరైన స్పష్టత లేకపోవడం అధ్యక్ష పదవికి దూరమయ్యేలా చేసింది. అయితే ఈనెల 21న హెచ్‌సీ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎమ్) జరుగనుంది. ఇందులో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. ప్రస్తుత పాలకవర్గం ఆర్థిక అవకతవకలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా హైకోర్టు ఆదేశాలను అనుసరించి అపెక్స్ కౌన్సిల్ హెచ్‌సీఏ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.

222

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles