విదేశీ కోచ్ వల్ల మేలే


Mon,September 9, 2019 01:15 AM

SINDHU

-ప్రపంచ చాంపియన్ సింధు వ్యాఖ్య

ముంబై: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌గా అవతరించిన తెలుగు షట్లర్ల పీవీ సింధుకు ప్రశంసలు, సత్కారాలు కొనసాగుతున్నాయి. చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకంతో మెరిసిన ఆమెను సహారా ఇండియా పరివార్ ఆదివారం ఇక్కడ సన్మానించింది. అనంతరం సింధు మాట్లాడుతూ చాంపియన్‌షిప్ కోసం ఎంతో కాలం నుంచి కఠోరంగా శ్రమించానని చెప్పింది. తన విదేశీ కోచ్ కిమ్ జి హ్యున్ చేసిన మార్పులు తన ఆటను మెరుగుపరుచుకునేందుకు ఉపయోగపడ్డాయని వెల్లడించింది. ఆమె సలహాలు తన ఆటపై చాలా ప్రభావాన్ని చూపాయని చెప్పింది. ఆమె (కిమ్ జి హ్యున్) సూచించిన కొన్ని మార్పులను కోచ్ గోపీచంద్ దిశానిర్దేశంలో పాటించా. మంచి ఫలితాలు వచ్చాయి. నైపుణ్యాన్ని చాలా పెంచుకున్నా. ఇంకా మెరుగవ్వాలిఅని సింధు చెప్పింది. ఫైనల్ ఒకుహరతో అని తెలిసినా.. గత మ్యాచ్‌ల ప్రభావం తనపై ఏ మాత్రం పడలేదని, తాను ఎప్పుడూ సానుకూలంగానే ఉంటానని ఆమె వెల్లడించింది. ఒకుహరపై అంతకు ముందు ఓడిపోయానన్న విషయం గుర్తే రాలేదు. నేను చాలా సానుకూలంగా ఉన్నా. ఫైనల్ అంటే మరో మ్యాచ్ అంతే. చాంపియన్‌షిప్ కోసం చాలా కాలంగా సన్నద్ధమయ్యా. చెన్ యూఫీ, ఒకుహర లాంటి ప్లేయర్లతో ఆడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. విభిన్నంగా ఆడాలి. అందుకే దూకుడుగా, చురుగ్గా కదులు తూ ఆడా. అలా ఆడడం చాలా అవసరం. మ్యాచ్ గురించే కాకుండా ప్రతీ పాయింట్ సాధించాలని ఆలోచిస్తాఅని సింధు చెప్పింది.

227

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles