ఫుట్‌బాల్ చాంప్ నిజామాబాద్


Sun,October 13, 2019 12:14 AM

FootBall
వనపర్తి క్రీడలు: ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన 65వ రాష్ట్ర స్థాయి అండర్-17 ఫుట్‌బాల్ టోర్నీలో నిజామాబాద్ బాలికల జట్టు విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో నిజామాబాద్ 1-0 తేడాతో మహబూబ్‌నగర్‌పై గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుం ది. ఈ టోర్నీలో గోల్‌కీపర్‌గా ప్రతిభ కనబరిచిన అక్షిత, మణి, సుగుణకు ప్రత్యేక ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.ముగింపు కార్యక్రమంలో వనపర్తి జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, గణేశ్, పీఈటీలు తిరుపతయ్య, శ్రీనివాస్ రెడ్డి, మన్యం, షబ్బీర్ పాల్గొన్నారు.

97

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles