పేస్ జోడీదే నాక్స్‌విల్లే చాలెంజర్


Tue,November 14, 2017 02:05 AM

leander
న్యూఢిల్లీ: వయస్సు పెరిగినా..తనలో చేవ తగ్గలేదని మరోమారు నిరూపించాడు భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్. నాక్స్‌విల్లే చాలెంజర్ ట్రోఫీలో పురవ్‌రాజాతో కలిసి విజేతగా నిలిచారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో టాప్‌సీడ్ పేస్, పురవ్ జోడీ 7-6(4), 7-6(4) తేడాతో అమెరికా, ఆస్ట్రేలియా ద్వయం జేమ్స్ సెర్రెటనీ, జాన్ ప్యాట్రిక్ స్మిత్‌పై విజయం సాధించింది. ఆది నుంచే హోరాహోరీగా తలపడటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగింది. తన అనుభవన్నంతా రంగరిస్తూ పురవ్ జతగా చెలరేగిన పేస్ ప్రత్యర్థి జోడీకి పరాజయం మిగిల్చాడు. గత ఆగస్టులో జోడీ కట్టిన తర్వాత లియాండర్, పురవ్‌కు ఇదే తొలి టైటిల్. లియోన్, ఇక్లే, తలహస్సీ టోర్నీల్లో విజేతగా నిలిచిన వెటరన్ పేస్ ఈ సీజన్‌లో నాలుగో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

449
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS