ఆరంభంలోఆరుగురు కెప్టెన్లు ఔట్


Thu,March 22, 2018 01:40 AM

ఐపీఎల్‌ప్రారంభోత్సవానికి ఇద్దరే స్పష్టం చేసిన బీసీసీఐ
CSK-V-MI
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఆరంభ వేడుకలంటే అభిమానులకు పండుగే..బాలీవుడ్ తారల నృత్యాలు, ప్రత్యేక కార్యక్రమాలు ఆకట్టుకోవడమే ఇందుకు కారణం. అన్నిటికీ మించి తమ అభిమాన ఐపీఎల్ కెప్టెన్లందరూ ఒకే చోట చేరి హంగామా చేయడం అభిమానులకు ఎంతో మజా అందిస్తుంది. అయితే ఈసారి మాత్రం ఫ్యాన్స్‌కు ఆ కిక్ దొరుకదు. అంగరంగ వైభవంగా జరుగనున్న ఐపీఎల్ ఆరంభ వేడుకలకు ఆరుగురు కెప్టెన్లు దూరమవనున్నారు. మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు ఉండగా..చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మినహా మిగతా ఆరు జట్ల నాయకులు ఏప్రిల్ 7న ముంబైలో జరుగబోయే ప్రారంభ కార్యక్రమానికి హాజరుకారని బీసీసీఐ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆరంభ వేడుకకు ముందు రోజే (ఏప్రిల్ 6న) ఆయా జట్ల కెప్టెన్లందరితో ఒక వీడియో షూట్ చేయించి, సెర్మనీలో దానిని ప్రదర్శిస్తామని బీసీసీఐ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఓపెనింగ్ సెర్మనీ మరుసటి రోజు రెండు మ్యాచ్‌లు ఉన్నాయని, ఒకవేళ అందరు కెప్టెన్లు ఈ వేడుకకు హాజరైతే మరునాడు జరిగే మ్యాచ్‌ల కోసం ఆయా వేదికలకు ప్రయాణం చేయడం కష్టమవుతుందన్నారు.

ఐపీఎల్‌లో డీఆర్‌ఎస్ : అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి(డీఆర్‌ఎస్)ను ఐపీఎల్‌లోనూ అమల్లోకి తీసుకురాబోతున్నారు. బుధవారం జరిగిన ఓ ప్రమోషన్ కార్యక్రమంలో ఐపీఎల్ చైర్మన్ రాజీవ్‌శుక్లా దీన్ని ధృవీకరించారు. మరోవైపు షమీ కేసుపై స్పందిస్తూ బీసీసీఐ అవినీతి నిరోధక యూనిట్ చీఫ్ నీరజ్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ ముగిసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు.

2027

More News

VIRAL NEWS