ధోనీకి అరుదైన గౌరవం


Tue,January 22, 2019 12:09 AM

icc-twitter
దుబాయ్: మాజీ కెప్టెన్, టీమ్ ఇండియా క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలో ముగిసిన వన్డే సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన ధోనీని.. ఐసీసీ సముచితరీతిన గౌరవించింది. సోమవారం తన అధికార ట్విట్టర్ పేజీ కవర్ ఫొటోగా ధోనీ ఫొటోను అప్‌డేట్ చేసింది. ఆస్ట్రేలియా గడ్డపై వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. అంతేకాదు వయసైపోయిన అతను ఇక రిటైర్‌కావడం మంచిదన్న విమర్శలను తిప్పికొడుతూ వన్డే సిరీస్‌లో వరుసగా మూడు అర్ధసెంచరీలతో దుమ్మురేపాడు. ఆసీస్ పర్యటనలో కీలక ఇన్నింగ్స్‌లాడిన ధోనీని ఐసీసీ గౌరవిస్తూ అధికారిక ట్విట్టర్ ఖాతాకు అతని ఫొటోను జోడించింది.

441
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles