మహిళల గ్రాండ్‌మాస్టర్ టోర్నీ ఆలోచన భేష్


Fri,August 10, 2018 12:26 AM

క్రీడల కార్యదర్శి బుర్రా వెంకటేశం
chess
హైదరాబాద్,నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: మేధావుల ఆటగా పేర్కొనే చదరంగం క్రీడకు హైదరాబాద్ కేంద్ర స్థానంగా మారుతున్నది. మహిళల కోసం ప్రత్యేకంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో గ్రాండ్‌మాస్టర్లు, అంతర్జాతీయ మాస్టర్లతో కూడిన మహిళలతో అంతర్జాతీయ టోర్నీకి హైదరాబాద్ నగరంలోని నీతం (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటి మేనేజ్‌మెంట్)లో నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీలో భారత్‌కు చెందిన 6గురు అంతర్జాతీయ మాస్టర్లతో పాటు వియత్నాం, కజకిస్థాన్, మంగోలియా, ఉక్రెయిన్ దేశాలకు చెందిన మహిళా ప్లేయర్లు పాల్గొంటున్నారు. గురువారం నీతంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ క్రీడల కార్యదర్శి బీ వెంకటేశం, సాట్స్ చైర్మన్ ఏ వెంకటేశ్వరరెడ్డి, టీఎస్ చెస్ సంఘం అధ్యక్షుడు నర్సింహారెడ్డి టోర్నీని ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథాన దూసుకుపోతుందని, క్రీడలలోనూ మన హైదరాబాద్ అంతర్జాతీయస్థాయి టోర్నీలకు ఆతిథ్యం ఇస్తుందంటే అందుకు కేసీఆర్ విధానాలే దోహదపడుతున్నాయని వెంకటేశం చెప్పారు. లోపాలు లేకుండా టోర్నీని విజమయవంతం చేయాలని నిర్వాహకులను కోరారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ కార్యక్రమంలో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికను బీవెంకటేశం సత్కరించారు.

chess2
ఈ టోర్నీలో విజేతలకు మొత్తం బహుమతి రూ.7లక్షల 50వేలు కాగా.. మొదటి బహుమతి రూ.1,60వేలు, ద్వితీయ బహుమతి రూ.1లక్ష30వేలు, తృతీయ బహుమతిగా రూ.లక్షను నజరానాగా అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చెస్ సంఘం కార్యదర్శి కేఎస్ ప్రసాద్, నీతం డైరెక్టర్ శేరి చిన్నంరెడ్డి, కార్పొరేటర్ సామ స్వప్నారెడ్డి, ద్రోణవల్లి హారిక తదితరులు పాల్గొన్నారు.

180

More News

VIRAL NEWS

Featured Articles