ఇషా సింగ్‌ ‘రికార్డు’ షూట్‌


Wed,September 18, 2019 01:32 AM

isha-singh
న్యూఢిల్లీ: జాతీయ షూటింగ్‌ ట్రయల్స్‌లో తెలంగాణ యువ షూటర్‌ ఇషా సింగ్‌ అదరగొట్టింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ టోర్నీల్లో సత్తాచాటిన ఇషా.. తాజాగా తన అద్భుత ప్రదర్శనతో జూనియర్‌ ప్రపంచ రికార్డును సవరించింది. మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ జూనియర్‌ విభాగంలో ఇషా 244.0 పాయింట్లు సాధించింది. దీంతో ఇప్పటి వరకు ఉన్న 242.5 పాయింట్ల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. అర్హత రౌండ్‌ నుంచే జోరు ప్రదర్శించిన ఇషా.. ప్రత్యర్థులకు దీటైన సవాలు విసురుతూ కీలక పాయింట్లు కొల్లగొట్టి విజేతగా నిలిచింది. తాజా రికార్డుతో పిన్న వయసులో(14 ఏండ్లు) జాతీయ విజేతతో పాటు జూనియర్‌ విభాగంలో రికార్డును తన పేరిట లిఖించుకుంది. ట్రయల్స్‌-7 టోర్నీలో ఇప్పటి వరకు ఈ తెలంగాణ షూటర్‌ ఓవరాల్‌గా 574 పాయింట్లతో కొనసాగుతున్నది. తాజా ప్రదర్శన ద్వారా నవంబర్‌లో దోహా వేదికగా జరిగే ఆసియా చాంపియన్‌షిప్‌ టోర్నీకి ఇషా ఎంపికైంది

286

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles