మలన్, మోర్గాన్ మెరుపులు


Sat,November 9, 2019 12:03 AM

-కివీస్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం
malan
నేపియర్: వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ మలన్ (51 బంతుల్లో 103 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు), కెప్టెన్ మోర్గాన్ (41 బంతుల్లో 91; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో ఇంగ్లండ్ జయభేరి మోగించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో నెగ్గిన ఇంగ్లండ్.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మలన్, మోర్గాన్ విజృంభణతో మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లకు 241 పరుగులు చేసింది. 48 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న మలన్ ఇంగ్లండ్ తరఫున టీ20ల్లో వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అనంతరం లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయి.. చివరకు 16.5 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో పార్కిన్‌సన్ 4 వికెట్లు పడగొట్టాడు.

387

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles