లక్ష్యం దిశగా ఇంగ్లండ్


Sun,August 25, 2019 01:42 AM

లీడ్స్: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ మూడో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్నది. ఆసీస్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన ఇంగ్లండ్ మూడో రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. 15 పరుగులకే ఓపెనర్లు బర్న్స్(7), రాయ్(8) వికెట్లు కోల్పోయిన జట్టును కెప్టెన్ జో రూట్(74 నాటౌట్), జో డెన్లీ(50) అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. ఆదిలోనే రెండు వికెట్లు తీసి మ్యాచ్‌పై పట్టు సాధించామనుకున్న కంగారూలకు రూట్, డెన్లీ ప్రతిబంధకంగా మారారు. ఇన్నింగ్స్ గాడిలో పడిందనుకుంటున్న తరుణంలో డెన్లీని హాజిల్‌వుడ్(2/35) ఔట్ చేయడం ద్వారా మూడో వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. చేతిలో ఏడు వికెట్లు ఉన్న ఇంగ్లండ్..ఇంకా 203 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 171/6తో ఇన్నింగ్స్‌కు దిగిన ఆసీస్ 246 పరుగులకు ఆలౌటైంది. మార్నస్ లాబుచాంగ్నె(80) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. స్టోక్స్(3/56), ఆర్చర్(2/40), బ్రాడ్(2/52) ఆకట్టుకున్నారు.

723

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles