ఇంగ్లండ్ 184 ఆలౌట్


Fri,May 25, 2018 12:32 AM

alastair-cook
లండన్: పాకిస్థాన్‌తో గురువారం మొదలైన తొలి టెస్టులో ఇంగ్లండ్ తడబడింది. పాక్ బౌలర్లు మహ్మద్ అబ్బాస్ (4/23), హసన్ అలీ (4/51) నిప్పులు చెరిగే బంతులకు తొలి ఇన్నింగ్స్‌లో 58.2 ఓవర్లలో 184 పరుగులకే ఆలౌటైంది. కుక్ (70), స్టోక్స్ (38), బెయిర్‌స్టో (27) ఓ మాదిరిగా ఆడారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఆరంభం నుంచే వికెట్లు చేజార్చుకుంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాక్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లలో వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. అజర్ అలీ (18 బ్యాటింగ్), హారిష్ సోహైల్ (21 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.

కుక్ మరో ఘనత

ఈ మ్యాచ్ ద్వారా కుక్ అరుదైన ఘనత అందుకున్నాడు. వరుసగా 153 మ్యాచ్‌లు ఆడిన ఆసీస్ బ్యాటింగ్ దిగ్గజం అలెన్ బోర్డర్ రికార్డును కుక్ సమం చేశాడు. కుక్ కెరీర్‌లో ఇది 154వ టెస్టు. 2006లో నాగ్‌పూర్‌లో భారత్‌పై అరంగేట్రం చేసిన కుక్ సెంచరీతో చెలరేగాడు. కానీ అనారోగ్యం కారణంగా తర్వాతి మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. ఇక ఆ తర్వాతి నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి టెస్టు మ్యాచ్‌లో కుక్ బరిలోకి దిగాడు. ఒక్కసారి కూడా సెలెక్టర్లు అతన్ని పక్కనబెట్టలేదు. బోర్డర్, కుక్ ఇద్దరు ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ కావడం విశేషమైతే.. ఇద్దరూ 11 వేల పరుగులు సాధించారు.

413

More News

VIRAL NEWS