ఇంగ్లండ్‌కు సూపర్ గెలుపు


Mon,November 11, 2019 03:39 AM

England
3-2తో కివీస్‌పై సిరీస్ విజయం
అక్లాండ్ : సూపర్ ఓవర్ ద్వారా న్యూజిలాండ్‌ను ఇంగ్లండ్ జట్టు మరోసారి ఓడించింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన నిర్ణయాత్మక చివరి మ్యాచ్‌లో ఆతిథ్య కివీస్‌ను మట్టికరిపించిన మోర్గాన్ సేన 3-2తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. వర్షం కారణంగా 11ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్లలో రెండు జట్లు 146 పరుగులే చేశాయి. ఆ తరువాత జరిగిన సూపర్ ఓవర్‌లో సత్తాచాటిన ఇంగ్లండ్ విజయం సాధించింది. మార్టిన్ గప్టిల్(20బంతుల్లో 50), ఇన్‌గ్రమ్(21బంతుల్లో 46), సీఫెర్ట్(16 బంతుల్లో 39) చెలరేగి ఆడడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 11ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది.

భారీ లక్ష్యఛేదనలో టామ్ బాంటన్(7), విన్స్(1) విఫలమైనా ఇంగ్లండ్ కీపర్ బెయిర్‌స్టో(18 బంతుల్లో 47) అదరగొట్టాడు. కెప్టెన్ మోర్గాన్(17), సామ్ కరన్(24)తో కలిసి కీలక భాగస్వామ్యాలు చేశాడు. చివరి ఓవర్‌లో ఇంగ్లండ్ టేలెండర్ క్రిస్ జోర్డాన్(3బంతుల్లో 12) నాలుగో బంతికి సిక్సర్ సహా చివరి బంతికి ఫోర్ కొట్టి మ్యాచ్‌ను టై చేశాడు. ఆ తర్వాత సూపర్ ఓవర్‌లో కివీస్ కెప్టెన్ సౌథీ బౌలింగ్ చేయగా ఇంగ్లండ్ తరఫున బెయిర్‌స్టో, మోర్గాన్ బరిలోకి దిగి 17 పరుగులు చేశారు. కివీస్ తరఫున బ్యాటింగ్ చేసిన మార్టిన్ గప్టిల్, టిమ్ సీఫెర్ట్, గ్రాండ్‌హోమ్ 8 పరుగులే చేయగలిగారు. ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లోనూ కివీస్‌పై సూపర్ ఓవర్ ద్వారానే ఇంగ్లండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే.

515

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles