ఉప్పల్ పోరుకు భారీ బందోబస్తు


Fri,October 13, 2017 12:36 AM

police
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగే టీ20 మ్యాచ్‌కు భారీ బందోబస్తును ఏర్పాటుచేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. గురువారం స్టేడియంలో భద్రత ఏర్పాట్లను సమీక్షించిన కమిషనర్.. 56 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు మీడియాకు వెల్లడించారు. మ్యాచ్ సందర్భంగా ఎలాంటి నిషేధిత వస్తువులను స్టేడియంలోకి అనుమతించమన్నారు. సెల్‌ఫోన్లకు అనుమతి ఉన్నా, ల్యాప్‌టాప్‌లు, పవర్‌బ్యాంక్‌లు, కెమెరాల వంటిని నిషేధించినట్లు వివరించారు. బ్లాక్‌లో టిక్కెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

279

More News

VIRAL NEWS