బెంగళూరులో పింక్ ప్రాక్టీస్


Mon,November 11, 2019 02:59 AM

బెంగళూరు : బంగ్లాదేశ్‌తో ఈ నెల 22-26 మధ్య జరిగే తొలి డే అండ్ నైట్ టెస్టు కోసం భారత ఆటగాళ్లు కసరత్తులు మొదలుపెట్టేశారు. ఆదివారం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో టీమ్‌ఇండియా నయావాల్ చతేశ్వర్ పుజార, టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే, హనుమ విహారి, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, పేసర్లు మహమ్మద్ షమీ, ఇశాంత్ శర్మ గులాబీ బంతులతో ప్రాక్టీస్ చేశారు. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్, ఎన్‌సీఏ ప్రస్తుత హెడ్ ద్రవిడ్ దిశానిర్దేశంలో శిక్షణ తీసుకుంటున్నారు. బంగ్లాతో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఈ నెల 14 నుంచి 18వ తేదీ మధ్య ఇండోర్ వేదికగా తొలి మ్యాచ్ జరుగనుండగా.. రెండో టెస్టు డే అండ్ నైట్‌గా కోల్‌కతాలో 22-26 మధ్య జరుగనుంది. టీ20లకు విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ కోహ్లీ టెస్టు సిరీస్‌కు జట్టులోకి రానున్నాడు.

551

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles