ఫైనల్ చేరడమే లక్ష్యం


Mon,September 23, 2019 01:19 AM

DUTEE

-ప్రపంచ చాంపియన్‌షిప్‌పై ద్యుతీ వ్యాఖ్య

న్యూఢిల్లీ: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, కచ్చితంగా ఫైనల్‌కు చేరాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ వెల్లడించింది. 2017లో లండన్ వేదికగా జరిగిన చాంపియన్‌షిప్‌లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయిన ద్యుతీ.. 100మీటర్లను 12.7 సెకన్లలో పూర్తిచేసి సెమీస్‌కు కూడా చేరలేకపోయింది. అ యితే అప్పటి తప్పులను సవరించుకొని, ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలని ద్యుతీ పట్టుదలగా ఉంది. దోహాలో అత్యుత్తమ ప్రదర్శన చేస్తానని అనుకుంటున్నా. అదే నా లక్ష్యం. గతసారి సెమీస్‌కు కూడా వెళ్లలేదు. ఈసారి కచ్చితంగా ఫైనల్స్ చేరుతానని నమ్ముతు న్నా అని ద్యుతీ చెప్పింది.

167

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles