ద్రవిడ్‌కు ఆ నాలుగు సీలు ఉన్నాయ్!

Thu,January 12, 2017 01:52 AM

DRAVID
న్యూఢిల్లీ: ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా కోట్లాది మంది అభిమానుల మన్ననలు అందుకొన్న రాహుల్ ద్రవిడ్ బుధవారం 44 వడిలోకి ప్రవేశించాడు. ఈ సందర్భంగా కేంద్ర క్రీడామంత్రి విజయ్ గోయల్, సెహ్వాగ్, కైఫ్, అనురాగ్ ఠాకూర్‌లు ద్రవిడ్‌కు సోషల్ మీడి యా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపా రు. ఇక సెహ్వాగ్ తనదైన శైలిలో చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంది. అతనిలో మూడు సీలు ఉన్నాయి. ఇందులో కమిట్‌మెంట్ (నిబద్ధత), క్లాస్ (సొగసైన ఆటతీరు), కన్సిస్టెన్సీ (నిలకడ), కేర్ (జాగ్రత్త) లాంటి లక్షణాలు ద్రవిడ్ సొంతం. అతనితో కలిసి ఆడటాన్ని గర్వంగా భావిస్తున్నా. హ్యాపీ బర్త్‌డే రాహుల్ అని వీరూ ట్వీట్ చేశాడు.

664

More News

మరిన్ని వార్తలు...