వారిపై వేటు సరైందే : హర్భజన్ సింగ్


Sun,January 13, 2019 02:16 AM

HarbhajanSingh
న్యూఢిల్లీ: కనీసం మిత్రులతో చర్చించలేని అంశాలను టాక్ షోలో అలవోకగా మాట్లాడి క్రికెటర్ల గౌరవాన్ని మంట గలిపారని యువ క్రికెటర్లు పాండ్యా, రాహుల్‌పై .. భారత సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వీరిపై బీసీసీఐ వేటు వేయడం సరైన నిర్ణయమని సమర్థించారు. టాక్ షోలో మాట్లాడిన సందర్భంగా జట్టు సహచరుల గదుల్లోనూ సెక్స్ చేశారా అని ప్రశ్నించగా.. రాహుల్, పాండ్యా సానుకూలంగా స్పందించారు. జట్టు సంస్కృతి గురించి అసభ్యకరంగా మాట్లాడడానికి వీరెంత కాలం జట్టులో ఉంటున్నారో చెప్పాలని ప్రశ్నించాడు. వీరి మాటలతో సచిన్ అలాంటోడు.. హర్భజన్ ఇలాంటోడు అనుకునే ప్రమాదముందని హర్భజన్ ఆవేదన వ్యక్తం చేశాడు.

548

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles