నాకొద్దు.. మా కోచ్‌కైనా ఇవ్వండి


Mon,September 23, 2019 01:30 AM

AMIT-PANGHAL

-అవార్డులపై అమిత్ పంగల్

న్యూఢిల్లీ: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో అదరగొట్టే ప్రదర్శనతో రజతం నెగ్గిన స్టార్ బాక్సర్ అమిత్ పంగల్.. తన ప్రతిభను గుర్తించకపోయినా ఫర్వాలేదు కానీ.. వ్యక్తిగత కోచ్ అనిల్ ధన్కర్‌కు ద్రోణాచార్య అవార్డు ఇవ్వడం సముచితంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. మెగాటోర్నీలో భారత్ తరఫున తొలి రజత పతకం గెలిచి చరిత్ర సృష్టించిన పంగల్.. 2012లో అనుకోని విధంగా డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించి ఏడాది పాటు నిషేధానికి గురయ్యాడు. దీంతో మంచి ప్రదర్శనలు చేసినా.. అతడికి అర్జున అవార్డు దక్కకుండాపోయింది. ఈ నేపథ్యంలో చారిత్రక మెడల్ సాధించిన అనంతరం అవార్డులపై అమిత్ తన మనోగతాన్ని వెల్లడించాడు. వ్యక్తిగతంగా నేను అవార్డులను పెద్దగా పట్టించుకోను. కానీ నన్ను తీర్చిదిద్దిన కోచ్ అనిల్ ధన్కర్‌కు ద్రోణాచార్య అవార్డు ఇస్తే సంతోషిస్తా. ఆయన లేకుంటే నేను బాక్సర్‌గా ఈస్థాయిలో ఉండేవాడిని కాదు. 2008లో నేను రింగ్‌లో అడుగుపెట్టా. అప్పటి నుంచి ధన్కర్ సర్ నన్ను రాటుదేల్చారు. నాకు ఏ విషయంలో సూచనలు, సలహాలు అవసరమైనా ఆయననే సంప్రదిస్తా. నా కోచ్‌కు అవార్డు ఇస్తే నాకు ఇచ్చినట్టే. అదే నన్ను ఎక్కువ సంతోషపరుస్తుందిఅని అమిత్ పంగల్ అన్నాడు.

787

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles