ఐపీఎల్‌తో పోల్చవద్దు


Wed,May 15, 2019 08:40 AM

sourav
- కోహ్లీ కెప్టెన్సీపై గంగూలీ

కోల్‌కతా: ఐపీఎల్‌లో బెంగళూరు కెప్టెన్‌గా విరాట్ వైఫల్యం వన్డే వరల్డ్‌కప్ సారథ్యంపై ఎలాంటి ప్రభావం చూపదని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. భారత్ తరఫున వన్డేల్లో కోహ్లీకి మెరుగైన రికార్డు ఉందని దాదా గుర్తుచేశాడు. విజయవంతమైన కెప్టెన్లు మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్ శర్మ జట్టులో ఉండటం కోహ్లీకి కలిసొచ్చే అంశమని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో విరాట్ కెప్టెన్సీ రికార్డు గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. భారత్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో అతడి రికార్డు చాలా బాగుంది. వైస్ కెప్టెన్‌గా రోహిత్, మాజీ కెప్టెన్‌గా ధోనీ ఉండటం కోహ్లీకి అనుకూలాంశం. వరల్డ్‌కప్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ముఖ్య పాత్ర పోషించనున్నాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న అతడి ప్రదర్శన జట్టుకు ఎంతో ఉపయోగపడనుందిఅని గంగూలీ అన్నాడు. పాకిస్థాన్‌కు ఇంగ్లండ్ పిచ్‌లు బాగా అచ్చొచ్చాయని ప్రపంచకప్‌లో ఇది వాళ్లకు లాభం చేకూరుస్తుందని దాదా అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ గడ్డపై పాకిస్థాన్ మెరుగ్గా ఆడుతుంది. ఇటీవల ఇంగ్లండ్‌తో ఆడిన వన్డే సిరీస్‌లోనూ పాక్ మెరుపులు మెరిపించింది. అసాధ్యమనుకున్న ఛేదనలో దగ్గర వరకు వచ్చి ఆగింది. పాక్ బౌలింగ్ లైనప్‌తో ప్రత్యర్థులకు కష్టాలు తప్పకపోవచ్చుఅని గంగూలీ చెప్పుకొచ్చాడు. విశ్వసమరంలో భారత్, పాకిస్థాన్ పోరుపై దాదా స్పందిస్తూ.. నేను రికార్డులను నమ్మను. మ్యాచ్ రోజు ఎవరు మంచి ప్రదర్శన చేస్తే.. విజయం వారినే వరిస్తుంది. ప్రస్తుతం భారత్ బలంగా ఉంది. విరాట్ సేనను ఓడించాలంటే పాక్ శక్తికి మించి కష్టపడాల్సిందేఅని వివరించాడు. 2003 ప్రపంచకప్‌లో ఆడిన జట్టుతో ప్రస్తుత జట్టును పోల్చేందుకు దాదా ఒప్పుకోలేదు. రెండు వేర్వేరు తరాలకు చెందిన జట్లని.. అప్పుడు మేము ఫైనల్ వరకు చేరామని.. ఈ జట్టు ఫైనల్లో గెలిచి ట్రోఫీతో తిరిగిరావాలని గంగూలీ ఆకాంక్షించాడు.

212

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles