విచారణకు మళ్లీ హాజరు కాను


Thu,May 16, 2019 04:03 AM

-అంబుడ్స్‌మన్‌కు తెలిపిన వీవీఎస్ లక్ష్మణ్
vvs-laxman
న్యూఢిల్లీ: పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలో విచారణకు మళ్లీ హాజరు కావాల్సిన అవసరం లేదని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. క్రికెట్ సలహాదారుల కమిటీ(సీఏసీ)లో సభ్యునిగా కొనసాగుతూ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటార్‌గా కొనసాగడంపై సంజీవ్ గుప్తా ఫిర్యాదు మేరకు బీసీసీఐ అంబుడ్స్‌మన్ జస్టిస్ డీకే జైన్..లక్ష్మణ్, సచిన్ మంగళవారం హాజరైన సంగతి తెలిసిందే. మూడు గంటల పాటు లక్ష్మణ్, సచిన్ వాదనలు విన్న డీకే జైన్ తదుపరి విచారణ ఈనెల 20న ఉంటుందని పేర్కొన్నారు. అయితే దీనిపై లక్ష్మణ్ తాజాగా స్పందిస్తూ పరస్పర విరుద్ధ ప్రయోజనాల విషయంలో అన్ని వివరించామని, లిఖిత పూర్వక అఫిడవిట్‌ను కూడా దాఖలు చేసానని తిరిగి విచారణకు హాజరుకానని అంబుడ్స్‌మన్‌కు తెలిపాడు. ఒక వేళ విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నట్లు రుజువైతే..సీఏసీ పదవి నుంచి తప్పుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు లక్ష్మణ్ వివరించాడు. వీవీఎస్ లక్ష్మణ్ ఇప్పటికే లిఖిత పూర్వక సమాధానమిచ్చాడు. సమర్పించిన నివేదికను అనుసరించి తదుపరి చర్యలుంటాయి. తదుపరి విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదు అని అంబుడ్స్‌మన్ ప్రకటనను బీసీసీఐ తమ అధికారిక వెట్‌సైట్‌లో పెట్టింది.

272

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles