తప్పైంది.. క్షమించండి!


Mon,September 9, 2019 01:08 AM

Dinesh-karthik

-బీసీసీఐకి దినేశ్ కార్తీక్ లేఖ

న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ (టీకేఆర్) జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చోవడంతో పాటు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు టీమ్‌ఇండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్‌కు బీసీసీఐ షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాంట్రాక్టును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ వివరణ సైతం కోరింది. ఈ నోటీసులపై కార్తీక్ ఆదివారం స్పందించాడు. బీసీసీఐకు బేషరతుగా క్షమాపణలు చెప్పాడు. సరైన అనుమతి తీసుకోకుండా ఇలా చేసినందుకు బీసీసీఐకి బేషరతుగా క్షమాపణలు చెబుతున్నా. ఇక నుంచి టీకేఆర్ జట్టుకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనను. అలాగే జట్టులో ఎలాంటి బాధ్యత వహించను అని బీసీసీఐకు రాసిన లేఖలో కార్తీక్ పేర్కొన్నాడు.

1058

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles