ధోనీ లేనందువల్లే యువీకి అవకాశం

Thu,January 12, 2017 02:03 AM

YOGRAJ
ముంబై: యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ మరోసారి ధోనీని టార్గెట్ చేశాడు. యువీ ఎదుగుదలను అడ్డుకుంటున్నాడంటూ ఎప్పుడూ ధోనీపై విమర్శలు గుప్పించే యోగ్‌రాజ్.. ఈసారీ అదే తరహాలో మండిపడ్డాడు. మూడేండ్ల తర్వాత ఇటీవల ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు యువరాజ్ చోటు దక్కించుకున్నాడంటే.. అందుకు కారణం ధోనీ కెప్టెన్‌గా లేకపోవడమే అని యోగ్‌రాజ్ అన్నా డు. సుదీర్ఘకాలంగా ధోనీ సారథిగా కొనసాగడంవ ల్లే యువరాజ్ జట్టులో ఎదగలేకపోయాడని ఓ మీ డియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో యోగ్‌రాజ్ ఆ రోపించాడు. ఇన్నాళ్లూ ధోనీ కెప్టెన్‌గా ఉండడంతో మావాడికి అవకాశాలు రాలేదు. ఇప్పుడు ధోనీ కెప్టెన్‌గా తప్పుకోవడంతో యువరాజ్‌కు మళ్లీ జట్టులో చోటు దక్కింది అని యోగ్‌రాజ్ అన్నాడు.

998
Tags

More News