ప్రపంచకప్‌లో ధోనీ చాలా కీలకం


Thu,May 16, 2019 04:04 AM

Virat-Kohli
ముంబై: సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ అనుభవం రానున్న ప్రపంచకప్‌లో చాలా కీలకమని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అపార అనుభవమున్న ధోనీ లాంటి క్రికెటర్ జట్టులో ఉండటం వల్ల తాను స్వేచ్చగా నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశముంటుందని కోహ్లీ అన్నాడు. ఇంగ్లిష్ వార్త పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చీఫ్ కోచ్ రవిశాస్త్రితో కలిసి కోహ్లీ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. క్రికెట్ కెరీర్ మొదలుపెట్టింది ధోనీ కెప్టెన్సీలోనే. గత కొన్నేండ్లుగా అతని ఆటతీరును చాలా దగ్గర నుంచి చూశాను. మైదానంలో పరిస్థితులకు అనుకూలంగా అతను తీసుకునే నిర్ణయాలు చాలా ఆసక్తి కల్గించేవి. తీవ్ర ఒత్తిడి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోకుండా మహీ చూపించే తెగువ వెలకట్టలేనిది. వికెట్ల వెనుకలా ఉంటూ బౌలర్లకు విలువైన సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటాడు. ఇటీవలి ఐపీఎల్‌లోనూ అతని కీపింగ్, కెప్టెన్సీ నైపుణ్యమేంటో చూశాం. జట్టులో ప్రతి ఒక్కరూ రాణించాలంటే ధోనీ సలహాలు ఎంతో అవసరం. మ్యాచ్‌లో ఒత్తిడిని ఎదుర్కొవడంలో పంత్ కంటే దినేశ్ కార్తీక్ అనుభవజ్ఞడు. ఎన్నో సార్లు ఫినిషర్‌గా అతను జట్టును ఒడ్డున పడేశాడు. అందుకే కార్తీక్‌ను ఎంపిక చేశాం అని కోహ్లీ అన్నాడు. జట్టుకు ఎంపికైన 15 మందిలో అవకాశాలు ఎప్పుడు వస్తాయో చెప్పలే ము. పరిస్థితులకు తగ్గట్లు సత్తాచాటేందుకు అందరూ సిద్ధం గా ఉండాలని విరాట్ స్పష్టం చేశాడు.

412

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles