చెపాక్ వికెట్‌పై ధోనీ, కోహ్లీ అసంతృప్తి!


Mon,March 25, 2019 01:44 AM

kohli
చెన్నై: ఐపీఎల్ తొలి మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన చెపాక్ పిచ్‌పై సీఎస్‌కే, ఆర్‌సీబీ కెప్టెన్లు ధోనీ, కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పిచ్ చాలా మందకొడిగా ఉందన్నారు. భారీ హిట్టర్లు ఇలాంటి వికెట్‌పై షాట్లు ఎలా కొడతారని ప్రశ్నించారు. రాబోయే మ్యాచ్‌ల్లోనైనా మంచి పిచ్‌లను తయారు చేస్తారని భావిస్తున్నా. ఇలాంటి పిచ్‌ను నేనెప్పుడూ ఊహించలేదు.

ఈ వికెట్‌ను చూస్తే 2011లో చాంపియన్స్ లీగ్ గుర్తొచ్చింది. మంచు ప్రభావం ఉన్నా.. బంతి మరి ఎక్కువగా టర్న్ అయ్యింది. అలా కాకూడదు. ఈ పిచ్‌ను మెరుగుపర్చాల్సిన అవసరం చాలా ఉంది అని ధోనీ పేర్కొన్నాడు. కనీసం 140, 150 స్కోరు వచ్చేలా పిచ్‌లు ఉంటే.. అటు ఆటగాళ్లు, ఇటు అభిమానులు మ్యాచ్‌ను ఆస్వాదిస్తారన్నాడు.

టీ20ల్లో 80, 90, 100, 120 కూడా చాలా తక్కువ స్కోరేనన్నాడు. మంచి స్పిన్నర్లు బంతులేస్తే బ్యాట్స్‌మెన్ ఆడటం చాలా కష్టమన్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో పెద్దగా టర్న్ కనిపించకపోవడంతో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నామని మహీ చెప్పాడు. మరోవైపు విరాట్ మాట్లాడుతూ.. ఈ పిచ్‌ను చూస్తే 140, 150 పరుగులు చేసేలా కనిపించింది. కానీ ఆడితే గానీ మందకొడిగా ఉందని తెలియలేదు. సీజన్ ఆరంభంలోనే ఇలాంటి పిచ్‌లపై ఆడకూడదు.

ఎలాగైనా మ్యాచ్‌లో నిలువాలనే ఉద్దేశంతో 18 ఓవర్ల వరకు తీసుకెళ్లాం. కనీసం 120 పరుగులు చేసినా పోరాడేవాళ్లం. మొదట బ్యాటింగ్ చేసిన ఏ జట్టుకైనా ఇదే పరిస్థితి ఉండేది. నాలుగు రోజులు పిచ్‌ను కప్పి పెట్టడంతో బ్యాట్స్‌మెన్‌కు భారీ షాట్లు కొట్టే అవకాశం రాలేదు అని కోహ్లీ వెల్లడించాడు.

323

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles