దీపికకు రజతం


Thu,July 18, 2019 03:14 AM

image
టోక్యో: టోక్యో(2020) ఒలింపిక్స్ టెస్ట్ ఈవెంట్‌లో భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి రజత పతకంతో మెరిసింది. తన అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూ ఆకట్టుకుంది. బుధవారం జరిగిన ఫైనల్లో ఆన్ సాన్(కొరియా) చేతిలో ఓడిన దీపిక రెండో స్థానంలో నిలిచింది. అర్హత రౌండ్‌లో నాలుగో స్థానంలో నిలిచి ప్రధాన రౌండ్‌లోకి ప్రవేశించిన దీపికకు కొరియా ఆర్చర్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. స్వల్ప తేడాతో తొలి సెట్‌ను దక్కించుకున్న ఆన్‌సాన్ అదే జోరులో మిగిలిన రెండు సెట్లను తన ఖాతాలో వేసుకుని స్వర్ణం దక్కించుకుంది. ఫైనల్స్‌కు అర్హత సాధించే క్రమంలో సెమీస్‌లో జెంగ్ యిచాయిపై 6-0తో, క్వార్టర్స్‌లో తతియాన అండ్రోలి(ఇటలీ)పై 6-5తో దీపిక విజయాలు సొంతం చేసుకుంది. మరోవైపు లైశీరామ్ బొంబాల్యదేవి, కోమలిక బారీ ఆదిలోనే నిష్క్రమించారు. పురుషుల విభాగంలో అతాను దాస్, తరుణ్‌దీప్‌రాయ్, ప్రవీణ్ జాదవ్ ఓటములతో తమ పోరాటాన్ని ముగించారు.

211

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles