హాకీ ప్లేయర్ల అనుమానాస్పద మృతి


Wed,August 14, 2019 01:25 AM

రాంచీ: జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు హాకీ ప్లేయర్లు అనుమానస్పదంగా మృతి చెందారు. సిమ్‌డెగా జిల్లాలోని బీరు గ్రామంలో సునందిని బాగె(23), శ్రద్ధ సోరెంగ్(18) చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయినట్లు మంగళవారం సీనియర్ పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. అయితే వీరిద్దరి మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత శనివారం నుంచి కనిపించకుండా పోయిన అమ్మాయిలను ఎవరో చంపేశారంటూ కన్నీరుమున్నీరు అవుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఐపీసీ 302 సెక్షన్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని సిమ్‌డెగా ఎస్పీ సంజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఇద్దరు హాకీ అమ్మాయిల మరణం వెనుక ఉన్న అసలు నిజమేంటో త్వరలో తెలుస్తుందని ఆయన అన్నారు. హత్యా లేక ఆత్మహత్య అన్నది ఇప్పుడే నిర్దారించడం సరికాదన్నారు.

234

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles