సఫారీ టీ20 కెప్టెన్‌గా డికాక్


Wed,August 14, 2019 01:21 AM

జొహాన్నెస్‌బర్గ్: టీమ్‌ఇండియాతో వచ్చే నెలలో జరుగనున్న టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా బోర్డు క్వింటన్ డికాక్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. మూడు టీ20లు, 3 టెస్టుల సిరీస్ ఆడేందుకు సఫారీ జట్టు భారత్ రానుంది. వీటిలో టీ20, టెస్టు సిరీస్ కోసం మంగళవారం క్రికెట్ దక్షిణాప్రికా (సీఎస్‌ఏ) 15 మందితో కూడిన జట్లను ప్రకటించింది. టెస్టు జట్టుకు డుప్లెసిస్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. బువుమా అతడి డిప్యూటీగా కొనసాగనున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో డుప్లెసిస్‌కు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు అతడి స్థానంలో ఓపెనర్ డికాక్‌ను కెప్టెన్‌గా నియమించారు. డస్సెన్ వైస్ కెప్టెన్‌గా నియమితమయ్యాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టిపెట్టేందుకు ఇటీవల టెస్టులకు వీడ్కోలు పలికిన వెటరన్ పేసర్ డెయిల్ స్టెయిన్‌కు టీ20 జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం.

288
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles