నన్ను వ్యక్తిగా మార్చింది!


Wed,June 13, 2018 01:07 AM

కూతురు జీవాపై ధోనీ వ్యాఖ్య
dhoni
ముంబై: తన కూతురు జీవా.. తననో పూర్తిస్థాయి వ్యక్తిగా మార్చిందని భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అన్నాడు. తన జీవితంలో చాలా మార్పులకు ఆమె కారణమన్నాడు. స్టార్ స్పోర్ట్స్ ఏర్పాటు చేసిన ఓ షోలో పాల్గొన్న మహీ.. తన కూతురుకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. నేను క్రికెటర్‌గా ఎలా మారానో నాకు తెలియదు. కానీ నన్ను మనిషిగా మార్చింది మాత్రం నా కూతురు జీవా. ఎందుకంటే కూతుళ్లు వాళ్ల తండ్రులకు చాలా దగ్గరగా ఉంటారని విన్నా అని ధోనీ వెల్లడించాడు. అయితే తన విషయంలో ఇది కాస్త భిన్నంగా జరిగిందన్నాడు. జీవా పుట్టినప్పుడు (మూడేండ్ల కిందట) తాను దగ్గరగా లేకపోవడం చాలా బాధ కలిగించిందన్నాడు. ఎక్కువగా క్రికెట్ ఆడుతూ దేశాలు తిరుగుతుండటంతో తన కూతురితో ఎక్కువగా గడుపలేకపోయానని చెప్పాడు. దీనివల్ల ఆరంభంలో జీవా దగ్గర కొద్దిగా ఇబ్బంది ఎదురైందన్నాడు. జీవా అన్నం తినకపోతే వాళ్లమ్మ.. నాన్న వస్తున్నారు త్వరగా తినేయ్ అనే భయపెట్టేది. అల్లరి చేసినప్పుడు నాన్నా వస్తున్నాడు అలా చేయొద్దని చెప్పేది. దీంతో ఎప్పుడైనా జీవాను దగ్గరకు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇవి గుర్తొచ్చి ఓ అడుగు వెనుకకు వేసేది. ఆరంభంలో అలా భయపడుతున్న జీవాను ఈ ఐపీఎల్ మరింత దగ్గరకు చేర్చింది అని ఈ మాజీ కెప్టెన్ వివరించాడు. ఈసారి లీగ్‌లో ప్రతి మ్యాచ్‌కు జీవా తనతో పాటే ఉందని చెప్పిన మహీ.. ఇది చాలా అద్భుతంగా అనిపించిందన్నాడు.

2882
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles