ఇంగ్లండ్ 1-0


Thu,July 12, 2018 01:03 AM

క్రొయేషియాతో సెమీస్ పోరు
మాస్కో: అర్ధ శతాబ్దం నుంచి ఊరిస్తూ వస్తున్న ఫిఫా కప్‌ను ఒడిసిపట్టుకోవాలన్న ఏకైక లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు.. సెమీస్ మ్యాచ్‌లో గర్జించింది. అభిమానులు సీట్లలో కుదురుకోకముందే అద్భుతమైన గోల్‌తో అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. మ్యాచ్ మొదలైన 5వ నిమిషంలో కైరాన్ ట్రిప్పిర్ కొట్టిన ఫ్రీకిక్ గింగిరాలు తిరుగుతూ టాప్ కార్నర్ నుంచి క్రొయేషియా గోల్‌పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. మధ్యలో ఆటగాళ్లు అడ్డుగోడలా నిలబడినా.. ప్రత్యర్థి గోలీ సుబాసిచ్ అమాంతం గాల్లోకి ఎగిరినా బంతిని అడ్డుకోలేకపోయాడు.

ట్రిప్పిర్‌కు అంతర్జాతీయ టోర్నీల్లో ఇదే తొలి గోల్ కావడం విశేషం. 2006 తర్వాత వరల్డ్‌కప్‌లో ఫ్రీకిక్‌ను గోల్‌గా మలిచిన తొలి ప్లేయర్‌గా ట్రిప్పిర్ రికార్డులకెక్కాడు. గతంలో డేవిడ్ బెక్‌హమ్ ఈక్వెడార్‌పై ఈ ఘనత సాధించాడు. స్వీడన్, కొలంబియాతో ఆడిన జట్టును యధావిధిగా దించి కోచ్ సౌత్‌గేట్ అందర్ని ఆశ్చర్యానికి లోను చేశాడు. 30వ నిమిషంలో గోల్‌పోస్ట్ అంచుల వద్ద హ్యారీకేన్ కొట్టిన షాట్ రీబౌండ్ అయి బయటకు వెళ్లింది. మ్యాచ్ ముందుకుసాగే కొద్ది క్రొయేషియా డిఫెన్స్ అంత అనుకూలంగా కదల్లేదు. దీంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

361

More News

VIRAL NEWS

Featured Articles