రైనాకు తప్పిన ముప్పు


Wed,September 13, 2017 01:13 AM

raina
కాన్పూర్: భారత క్రికెటర్ సురేశ్ రైనా కొద్దిలో రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఘజియాబాద్ నుంచి కాన్పూర్‌కు వెళుతుండగా, రైనా ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ ఎస్‌యూఏ కారు టైరు పేలిపోయింది. దీంతో డ్రైవింగ్ సీట్లో ఉన్న రైనా వెంటనే కారును అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. మంగళవార తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో రైనాకు ఎలాంటి గాయాలు కాలేదని స్థానిక పోలీసులు తెలిపారు. రైనా కారులో స్టెఫినీ లేకపోవడంతో అతణ్ని వేరే వాహనంలో పంపించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో ఇండియా బ్లూ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రైనా.. ఆ మ్యాచ్ కోసం తన కారులో కాన్పూర్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

550

More News

VIRAL NEWS