టోక్యోకు నిఖత్‌ను ఎంపిక చేయండి


Wed,October 23, 2019 03:07 AM

-కేంద్ర మంత్రికి క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ లేఖ
minister
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో నిలకడగా రాణిస్తూ పతకాలు కొల్లగొడుతున్న రాష్ట్ర యువ బాక్సర్ నిఖత్ జరీన్‌ను టోక్యో (2020) ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కు ఎంపిక చేయాలని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు, భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) డైరెక్టర్ జనరల్‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ లేఖ రాశారు. అంచలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నదని మంత్రి ప్రశంసించారు. అద్భుత ప్రతిభ కల్గిన జరీన్‌కు ఒలింపిక్స్‌లో అవకాశమిస్తే పతకం సాధించే అవకాశముందని ఆయన అన్నారు. జరీన్ ఎంపికపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళుతానని ఆమె తండ్రి జమీల్ అహ్మద్‌కు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

199

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles