రోహిత్‌ను టెస్టు ఓపెనర్‌గా పరిగణిస్తాం : ఎమ్మెస్కే


Wed,September 11, 2019 03:31 AM

న్యూఢిల్లీ : వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో విఫలమైన టీమ్‌ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ స్థానానికి ఎసరొచ్చేలా కనిపిస్తున్నది. పరిమిత ఓవర్ల స్టార్ రోహిత్ శర్మను సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ తీసుకోవాలని కొందరు మాజీలు సైతం సూచిస్తున్నారు. ఈ తరుణంలో చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా ఆ దిశగా సంకేతాలు ఇచ్చాడు. టెస్టుల్లో రాహుల్ ఫామ్ ఆందోళనకరంగా ఉందని మంగళవారం చెప్పాడు. విండీస్‌తో సిరీస్‌కు రోహిత్‌ను మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా ఎంపిక చేశామని, అయితే ఇకపై అతడిని ఓపెనర్‌గా పరిగణిస్తామని స్పష్టం చేశాడు. విండీస్ పర్యటన తర్వాత సెలెక్షన్ కమిటీ సమావేశం కాలేదు. రోహిత్‌ను ఓపెనర్‌గా తప్పకుండా పరిగణిస్తాం. ఈ అంశంపై చర్చిస్తాం. రాహుల్ ప్రతిభావంతుడైన ఆటగాడు. ఎక్కువ సేపు క్రీజులో ఉండి, అతడు మళ్లీ ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది అని ఎమ్మెస్కే వెల్లడించాడు.

408

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles