టెస్టులకు ఆదరణ పెరిగింది : కోహ్లీ


Wed,August 21, 2019 02:34 AM

virat-kohli
నార్త్‌సౌండ్(అంటిగ్వా) : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో అడుగుపెట్టేందుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. విండీస్‌తో గురువారం ప్రారంభమయ్యే మ్యాచ్‌తో యాత్రను మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో చాంపియన్‌షిప్ కోసం తాను ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. టెస్టు క్రికెట్‌కు ఆదరణ బాగానే ఉందని... ఈ ప్రయోగం వల్ల రెట్టింపవుతుందని అభిప్రాయపడ్డారు. వెస్టిండీస్ ప్లేయర్స్ అసోసియేషన్ అవార్డుల కార్యక్రమానికి హాజరైన విరాట్ మాట్లాడాడు. చాంపియన్‌షిప్ వల్ల ఆడే ప్రతి టెస్టుకు పరమార్థం వచ్చిందని చెప్పాడు. సరైన సమయంలో.. ఇది సరైన చర్య అంటూ ఐసీసీని ప్రశంసించాడు. టెస్టు క్రికెట్ పడిపోతున్నదని కొందరు అంటున్నారని, కానీ రెండేళ్లుగా సుదీర్ఘ ఫార్మాట్‌కు ఆదరణ విశేషంగా పెరిగిందని చెప్పుకొచ్చాడు.

మహీ రికార్డుకు అడుగు దూరంలో..

టెస్టుల్లో సారథిగా మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును సమం చేసేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ విజయం దూరంలో ఉన్నాడు. ధోనీ సారథ్యంలోని టీమ్‌ఇండియా విదేశాల్లో ఆడిన 60టెస్టుల్లో 27 మ్యాచ్‌లు గెలిచింది. పరాయి దేశాల్లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్‌గా రికార్డు మహీ పేరిట ఉంది. విండీస్‌తో తొలి మ్యాచ్‌లో భారత్ గెలిస్తే కెప్టెన్‌గా ఆ రికార్డును కోహ్లీ సమం చేస్తాడు. విరాట్ సారథ్యంలో టీమ్‌ఇండియా విదేశాల్లో ఇప్పటివరకు 46 టెస్టులు ఆడి 26 గెలిచింది.

506

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles